అలాంటి వాడినే నేను పెళ్లి చేసుకుంటా – శ్రీ లీల

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చలామణి అవుతున్న శ్రీ లీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుసగా పది చిత్రాలలో నటిస్తున్న ఈమె క్రేజ్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఒకవైపు తన అద్భుతమైన నటనతో.. డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD సినిమా ద్వారా అడుగుపెట్టినప్పటికీ కూడా బాలనటిగానే ఇండస్ట్రీకి పరిచయమైంది.

అయితే, తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో స్టార్ హీరోయిన్ శ్రీలీల తెలిపారు. ‘నన్ను కట్టుకోబోయేవాడు అందంగా ఉండి, కుటుంబానికి విలువ ఇవ్వాలి. అలాగే అతడికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలి. కొన్ని కొన్ని విషయాల్లో నన్ను భరించడం కొంచెం కష్టం. ఆ కష్టాన్ని ఇష్టంగా భావించాలి. ఇలాంటి లక్షణాలు ఉన్నవారితోనే నేను ఏడడుగులు వేస్తా’ అని చెప్పారు. కాగా, శ్రీలీల హీరోయిన్ గా నటించిన ‘ఆది కేశవ’ మూవీ రీసెంట్ గా విడుదల అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version