BREAKING : హీరో విశాల్ ఇంటిపై రాళ్ల దాడి..పరిస్థితి ఉద్రిక్తం !

-

BREAKING : తమిళ హీరో విశాల్‌ కు ఊహించని షాక్‌ తగిలింది. హీరో విశాల్ ఇంటిపై నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి…చేశారు. ఎరుపు రంగు కారులో వచ్చి, చెన్నైలోని విశాల్ ఇంటిపై రాళ్లు విసిరారు కొందరు ఆగంతకులు. విశాల్‌ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో కారు దృశ్యాలు…బయట పడ్డాయి.

ఈ నేపథ్యంలోనే… తన మేనేజర్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు హీరో విశాల్… చెన్నైలోని అన్నా నగర్ లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటున్న హీరో విశాల్…ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే.. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version