జైలు జీవితం గడిపిన స్టార్ హీరో సుమన్.. ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణం ఆయనేనా..?

-

ప్రముఖ హీరోగా ఎన్నో సినిమాలలో నటించి ఒక మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న స్టార్ హీరో సుమన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇకపోతే సుమన్ తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన తర్వాత ఎక్కువగా విలన్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకానొక సమయంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ ,శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ తర్వాత సుమన్ మాత్రమే స్టార్ హీరోగా రాణించేవారు. చిరంజీవి , బాలకృష్ణ ఆ తర్వాత స్థానంలో ఉండే వారని చెప్పవచ్చు. కానీ ఒకానొక సమయంలో అశ్లీల కేసులో ఎవరో కావాలనే ఇరికించడంతో ఆయన జైలుకు వెళ్లడం అప్పట్లో సంచలనం సృష్టించింది .ఇక ఉన్నట్టుండి ఈయన కెరియర్ అఘాతం లోకి వెళ్లిపోవడం జరిగింది.అప్పటివరకు స్టార్ హీరోగా కొనసాగుతున్న సుమన్ ని చూసి దర్శక నిర్మాతలు సైతం అవకాశాలు ఇవ్వలేదు. ఇక అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా సుమన్ నిజంగానే తప్పు చేశారు..అందుకే జైలుకు వెళ్ళాడు అని అంటుంటే డీ.వీ. నరసరాజు గారు మాత్రం తన మనవరాలని ఇచ్చి వివాహం చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అంతేకాదు అందరూ కూడా తెలిసి తెలిసి ఒక నిందితుడికి తన మనవరాలును రాజుగారు ఎందుకు ఇచ్చి వివాహం చేస్తారు అని అనుమానాలు కూడా అందరికీ ఎదురయ్యాయి. కానీ రాజుగారు తన మనవరాలు శిరీషను సుమన్ కిచ్చి వివాహం జరిపించడంతో ఆయన కెరియర్ మళ్ళీ ఒక ఉన్నత స్థానానికి చేరుకుందని చెప్పవచ్చు.ప్రముఖ స్టోరీ రైటర్ డీ.వీ.నరసరాజు మనవరాలు శిరీషను వివాహం చేసుకున్న తర్వాత సుమన్ పెద్దింటల్లుడు, పరువు ప్రతిష్ట, బావ బామ్మర్ది, చిన్నల్లుడు, అబ్బాయిగారి పెళ్లి వంటి చిత్రాలతో హీరోగా కొనసాగారు. ఇక తర్వాత విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, మారి ఎన్నో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక ఆయన డిప్రెషన్ నుంచి కోలుకొని ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు అంటే అందుకు కారణం ప్రముఖ స్టోరీ రైటర్ డివి నరసరాజు అని చెప్పవచ్చు. ఇక ఆయన వల్లే ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు సుమన్ అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version