మునుగోడు సీటు ఈ రోజు మాదే, రేపు కూడా మాదే – జీవన్ రెడ్డి

-

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మునుగోడు సీటు ఈ రోజు మాదే, రేపు కూడా మాదేనని.. అక్కడ బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదని విమర్శించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాజగోపాల్ ఎందుకు రాజీనామా చేశారో ఆయనకే తెలియదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటునే కించ పరిచేలా మోదీ మాట్లాడాడని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీజేపీ, టీఆరెస్ తోడు దొంగలు.. మునుగోడు అంతా పొలిటికల్ గేమ్ అని తెలిపారు.


రెండో స్థానంలో ఎవరుంటారో బీజేపీ, టీఆరెస్ తేల్చుకోవాలని సవాల్ విసిరారు. ప్రవేటు మెడికల్ కాలేజి సీట్లను బహిరంగ వేలానికి పెడుతున్నారని అగ్రహించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్లు అమలు చేయడం లేదని.. తెలంగాణ విద్యార్థులకు 85 శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కులను కాల రాస్తున్నారని అగ్రహించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version