రజిని కావాల్సిన భారతీయుడు కమల్ ఎలా అయ్యాడు..!

-

శంకర్ డైరక్షన్ లో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా ఇండియన్. తెలుగులో ఆ సినిమాను భారతీయుడుగా రిలీజ్ చేశారు. ఆ సినిమా కథ ముందు సూపర్ స్టార్ రజినికి వినిపించాడట శంకర్. ఆ సినిమా టైంలో రజిని వేరే సినిమా కమిట్ అవడం వల్ల ఇండియన్ సినిమా ఆఫర్ కాదన్నాడట. పెరియా మానుషన్ కథను కాస్త మార్చి కమల్ తో ఇండియన్ సినిమా చేశాడు శంకర్.

22 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమాకు సీక్వల్ గా ఇప్పుడు సీక్వల్ రాబోతుంది. ఈరోజు మొదలైన ఈ సినిమా ఓపెనింగ్ లో కమల్ సేనాపతి లుక్ లో కనిపించారు. సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తుంది. లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో సుభాస్కరన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కమల్ తో పాటుగా శింభు, దుల్కర్ సల్మాన్ లు స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. 2.ఓతో అంచనాలను అందుకోని శంకర్ ఈ సినిమాతో అయినా హిట్ అందుకుంటాడేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version