శ్వేతారెడ్డి, గాయ‌త్రి గుప్తా పోరాటంలో నిజ‌మెంత‌?

-

బిగ్ బాస్ -3పై యూ ట్యూబ్ యాంక‌ర్ శ్వేతారెడ్డి, వ‌ర్ధ‌మాన న‌టి గాయ‌త్రి గుప్తా లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. వాళ్ల‌ద్ద‌రికీ మ‌ధ‌తుగా కేతిరెడ్డి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి కూడా నిలిచారు. ఓయూ విద్యార్ధి సంఘాలు మ‌ద్ద‌తు సైతం ల‌భించింది. పంచాయ‌తీ ఢిల్లీకి చేరింది. ప్ర‌స్తుతం కేసు కోర్టు విచార‌ణ‌లో ఉంది. నిజా నిజాలు తేలాల్సి ఉంది. ప్ర‌స్తుతం షో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్ర‌సారం అవుతోంది. అయినా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా శ్వేతారెడ్డి, గాయ‌త్రి గుప్తా పోరాంటం కొన‌సాగిస్తున్నారు. రేపు కేతిరెడ్డి ఆధ్వ‌ర్యంలో న‌వ్యాంధ్ర రాజ‌ధ‌ని అమ‌రావ‌తి న‌డిబొడ్డున నిర‌స‌న చేయ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

Swetha reddy gayatri gupta in delhi against bigg boss-3

మ‌హిళా సంఘాలు, ప్ర‌జ‌ల‌కు, విద్యార్దులు మ‌ద్ద‌తివాల‌ని పిల‌పునిచ్చారు. కేతిరెడ్డి ప్ర‌త్యేకంగా త‌మిళ‌నాడులో ఉన్న తెలుగు వారంద‌న్నీ ఏకం చేసారు. ఉద్య‌మం మ‌రింత తీవ్ర త‌రం చేయ‌డానికి సంక‌ల్పించారు. ఈ నేప‌థ్యంలో శ్వేతారెడ్డి, గాయ‌త్రి గుప్తా పోరాటంలో నిజ‌మెంత‌? ఆమె పోరాటం షో లో అశ్లీల‌తో చోటు చేసుకుంటుంద‌నా? లేక ఆమెనే క‌మిట్ మెంట్ అడిగార‌ని ర‌చ్చ‌కెక్కిందా? అన్న ప్ర‌శ్న‌లు బిగ్ బాస్ నిర్వాహ‌కుల నుంచి రెయిజ్ అవుతున్నాయి.

శ్వేతారెడ్డిని క‌మిట్ మెంట్ అగ‌డాల్సిన అవ‌స‌రం నిర్వాహ‌కుల‌కు ఏముంటుంద‌ని కొత్త వాద‌న తెర‌పైకి వ‌స్తోంది. ఇక ఫేమ్ లో లేని గాయ‌త్రి గుప్తా ఆమెకు మ‌ద్ద‌తివ్వ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని అంటున్నారు. కేవ‌లం శ్వేతారెడ్డి, గాయ‌త్రి గుప్తాని షోకు ఎంపిక చేయ‌లేదు! అన్న కార‌ణంగానే ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారని..త‌ద్వారా పేరు కూడా వ‌స్తుంద‌నే ఇలా రోడ్డు కెక్కార‌ని బిగ్ బాస్ నిర్వాహ‌కుల్లో ఒక‌రు అనధికారికంగా అన్నారు. ఎవ‌రు నిజం? ఎవ‌రు అబద్ధం ? అన్న‌ది కోర్టులో త్వ‌ర‌లో తేల‌నుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version