సైరా నరసింహరెడ్డి క్లయిమాక్స్ డైలాగ్ విన్నారంటే మీ రోమాలు నిక్కబొడవాల్సిందే..!!

-

సైరా నరసింహరెడ్డి… మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ సినిమా ఇది. రీసెంట్ గా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సైరా మూవీ టీజర్ ను రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఇక.. టీజర్ ఎన్ని సంచలనాలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సినిమాలో ఆయన పలికే డైలాగ్ కూడా మెగా అభిమానులను ఆకట్టుకున్నది. పరుచూరి సోదరులు సైరా సినిమాకు కథతో పాటు డైలాగ్స్ కూడా రాశారు.

ఫస్ట్ డైలాగ్ ను సైరా టీజర్ లో చూపించగా.. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఓ డైలాగ్ ను పరుచూరి గోపాలకృష్ణ లీక్ చేశారు. పరుచూరి పలుకులు పేరుతో ఆయన యూట్యూబ్ లో ఓ చానెల్ ను నిర్వహిస్తున్నారు. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ డైలాగ్ ను లీక్ చేశారు.

“చేతులు వెనక్కి విరిచి కట్టేశాం. ముఖం ముందు ఉరితాడు వేలాడుతోంది. ఏంటిరా? ఆ దైర్యం.. చావు భయం లేదా నీకు? అని బ్రిటీష్ పాలకులు అంటే … చచ్చి పుట్టినవాడిని.. చనిపోయిన తర్వాత కూడా బతికే వాడిని.. చావంటే నాకెందుకురా భయం..” అంటూ సైరాగా చిరంజీవి డైలాగ్ చెబుతారని గోపాలకృష్ణ అన్నారు. దానికి సంబంధించిన వీడియో ఇదే..

Read more RELATED
Recommended to you

Exit mobile version