బాలకృష్ణ నన్ను తన రూమ్ కు పిలిచాడు – హీరోయిన్‌ సంచలనం

-

టాలీపుడ్ ప్రముఖ హీరో బాలకృష్ణపై హీరోయిన్ విచిత్ర సంచలన ఆరోపణలు చేశారు. కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి విచిత్ర…బాలకృష్ణతో “భలేవాడివి బాసు” అనే సినిమా టైంలో జరిగిన ఛేదు అనుభవాన్ని షేర్ చేసుకుందని సమాచారం అందుతోంది. సినిమా సమయంలో బాలకృష్ణ నన్ను అసభ్యకరంగా ఇబ్బంది పెట్టేవాడిని తన రూమ్ కి పిలిచాడంటూ బాంబ్‌ పేల్చారు హీరోయిన్ విచిత్ర.

Tamil actress Vichitra makes casting couch allegations against Balakrishna

ఈ విషయాలను తమిళ బిగ్‌ బాస్‌ షోలో కంటెస్టెంట్స్‌ తో పంచుకున్నారు. తాను ఓకే చెప్పకపోవడంతో నానా రకాలుగా ఇబ్బంది పెట్టారని ఫైర్‌ అయింది హీరోయిన్‌ విచిత్ర. ఆ తర్వాత రోజు నుంచి తన డోరును రోజు ఎవరో కొట్టేవారని ఆరోపణలు చేశారు. అడవిలో షూటింగ్ సమయంలో తాను చెప్పుకోలేని చోట తాకాడని బాలయ్యపై ఫైర్‌ అయింది. డైరెక్టర్ కు, ఫైట్ మాస్టర్ కు చెబితే నన్ను కొట్టారని ఎమోషనల్‌ అయ్యారు విచిత్ర. ఆ సమయంలో ఎవరు నన్ను పట్టించుకోలేదన్నారు. విచిత్ర చేసిన ఈ వ్యాఖ్యలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version