తెలుగు సీరియల్ టాప్ నటి అరెస్ట్.. ఏమైందంటే..?

-

ఇటీవల కాలంలో సమాజంలో అక్రమ సంబంధాలు భారీగా పెరిగిపోతున్నాయని చెప్పాలి.. ఇంట్లో భర్త ఉన్నా కానీ గుట్టు చప్పుడు కాకుండా పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకొని కాపురాలు నడిరోడ్డు మీదకు తెచ్చుకుంటున్నారు. ఆ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ఒక్కోసారి కట్టుకున్న భర్తని కడతేర్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ తరహా లోనే ప్రముఖ సీరియల్ నటి ఇలాంటి వ్యవహారం నడిపి పోలీసులకు చిక్కింది. గుప్పెడంత మనసు , గుండమ్మ కథ వంటి సీరియల్స్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న తెలుగు సీరియల్ నటి నాగవర్ధిని ని తాజాగా బంజారా హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

పూర్తి విషయంలోకి వెళ్తే .. రెండో ప్రియుడు శ్రీనుతో కలిసి మొదటి ప్రియుడు సూర్యా పై ఈమె హత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.. నిందితులిద్దరూ కూడా కలసి సూర్యాను భవనం పైనుంచి తోసేశారు. దీంతో బాధితులు పోలీసుల ఫిర్యాదు మేరకు పోలీస్ కేసు నమోదు చేసి నటి నాగవర్ధిని అరెస్టు చేయడం జరిగింది. ఒకరి మాయలో పడి మరొకరిని మోసం చేయడం విషయం పక్కన పెడితే.. ఏకంగా చంపాలనే ప్రయత్నం చేసిందని తెలిసి ఆమెతోటి నటీనటులంతా ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఈమె ఎందుకు ఇలా చేసింది అంటూ రకరకాలుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

సినిమాలలో నటించే సెలబ్రిటీలే కాదు సీరియల్స్ లో నటించే సెలబ్రిటీలు కూడా బాగా పాపులారిటీని తెచ్చుకుంటారు. ఎందుకంటే నిత్యం సీరియల్స్ లో కనిపిస్తూ తమ నటనతో, అందంతో ప్రేక్షకులను ఆకట్టుకునే వీరంటే ప్రజలు ఎక్కడున్నా సరే ఇట్టే గుర్తుపడతారు. సీనియర్ నటీనటులకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న వీరు ఏ చిన్న పని చేసినా సరే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటారు. మరి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డ నాగవర్థిని ని బుల్లితెర ఇండస్ట్రీ బ్యాన్ చేస్తుందేమో అన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version