టాలీవుడ్ ఎన్నికలపై తమ్మారెడ్డి భరద్వాజ వివాదస్పద వ్యాఖ్యలు..సిగ్గేస్తుంది !

-

నేడు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరగనున్నాయి. దిల్ రాజ్, సి.కళ్యాణ్ ప్యానెల్ మధ్య పోటీ జరగనుంది. అయితే.. ఈ తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలపై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఎలెక్షన్స్ చూస్తుంటే సంతోషించాలో ఏడవాలో తెలియట్లేదని.. చాలా ఎలెక్షన్స్ చూసేను… ప్రెసిడెంట్ గా కూడా గెలిచానని వివరించారు.

కానీ బైట ,లోపల వాతావరణం చూస్తుంటే ఛాంబర్ ఎదిగింది అని సంతోసహాపడాలా ? లేక జనరల్ ఎలెక్షన్స్ లాగా ఉందని సిగ్గు పడాలో తెలియట్లేదన్నారు. దేనికి పోటీ పడుతున్నారో , ఎందుకు కొట్టుకుంటున్నారో నాకు తెలియదని చెప్పారు. నేను ఛాంబర్ లో పని చేసెను, మా నాన్న పనిచేసాడు… ఛాంబర్ అనేది అన్ని సెక్టర్స్ కి మంచి చేయటాన్ని కి ఉందని వివరించారు. ఎలెక్షన్స్ కాంపెయిన్ చూస్తుంటే భయమేస్తుంది… ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదు అని కోరుకుంటున్నానన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.

Read more RELATED
Recommended to you

Exit mobile version