పెళ్లి అయిన ఏడాదికే గుండెపోటుతో నటి భర్త మృతి

-

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే చిత్ర పరిశ్రమలో చాలా మంది ప్రముఖ నటులు మరణించారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో చాలా మంది ప్రముఖ నటులు గుండెపోటుతో మరణించారు. అయితే.. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో తమిళ ఇండస్ట్రీకి చెందిన యువ నటి భర్త మృతి చెందాడు.

వివాహమైన ఏడాదిలోనే యువ నటి భర్త గుండెపోటుతో మరణించాడు. తమిళ బుల్లితెర నటి శృతి షణ్ముగప్రియ భర్త అరవింద్ శేఖర్ హార్ట్ ఎటాక్‌తో మృతి చెందాడు. 30 ఏళ్ల అరవింద్ శేఖర్..ఓ బాడీ బిల్డర్. శేఖర్‌, శృతి కొన్నాళ్ల డేటింగ్ అనంతరం గతేడాది ఇద్దరికి పెళ్లి జరిగింది. భారతీ కన్నమ్మ, వాణి రాణి, కళ్యాణ పరిసు సీరియల్స్‌తో శృతికి గుర్తింపు వచ్చింది. అయితే.. నిన్న ఉన్నట్టుండి అరవింద్ శేఖర్ గుండెపోటుతో కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించే లోపే అరవింద్ శేఖర్ మరణించాడని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version