మెగా ఫ్యాన్స్ కి ప్రామిస్ చేసిన డైరెక్టర్..!

-

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డైరెక్ట్ కరుణ కుమార్, వైర ఎంటర్టైన్ మెంట్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్ మెంట్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న మూవీ మట్కా. ఈ చిత్ర డైరెక్టర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. మెగా అభిమానులందరికీ నేను ఒక ప్రామిస్ చేదల్చుకున్నాను. వరుణ్ బాబుని మీరు ఎలా చూద్దామను కుంటున్నారో.. ఇలాంటి సినిమాలో చూద్దాం అనుకుంటున్నారో, ఆ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న సినిమా ఇది. ఆయనలో ఉన్న నటుడు, ఆయనలోని యాక్షన్ హీరో.. అన్ని కోణాల్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. 40 ఏళ్ల క్రితం జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీసిన సినిమా ఇది.

అప్పట్లో వైజాగ్ ఎలా ఉండేది, వైజాగ్ లో మనుషులు ఇలా ఉండేవారు, వైజాగ్ లో జరిగిన కథలు ఎలా ఉండేవి, వాటి మధ్యలో హీరో తాలూకా ప్రస్థానం ఎలా ఉంటుంది, అంతా కూడా ఈ సినిమాలో చూపించడానికి 100% నా ప్రయత్నం చేశాను. హీరో, టెక్నీషియన్స్, నిర్మాతలు అందరూ కూడా సహకరించారు. ఈ సినిమా డే వన్ ఎలా అనుకున్నామో అదే సినిమాని జు తెర మీదకి తీసుకురాగలిగాం.  దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ సినిమా నుంచి ఒక్కొక్క సర్పైజ్ వదులుతుంటాము. మీరు అన్ని ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాని పెద్ద విజయం సాధించే దిశగా మీరంతా తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నవంబర్ 14న మీ ఫ్యామిలీస్ తో సినిమా హాల్స్ లో కలుద్దాం థాంక్యూ’ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version