రవితేజ మూవీపై హైకోర్టుకెళ్లిన స్టువర్టుపురం ప్రజలు

-

వంశీకృష్ణ దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల సమీపంలో ఉండే స్టువర్టుపురానికి చెందిన గోకరి నాగేశ్వరరావు అనే ఓ దొంగ నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో రవితేజ దొంగగా కనిపించబోతుండగా.. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ అండ్ ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం గా ఈ చిత్రం రాబోతుంది.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఫిలిం ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వంశీకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం అక్టోబర్ 20, 2023న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అయితే తాజాగా ఈ మూవీ యూనిట్ కి షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని బాపట్ల జిల్లా స్టువర్టుపురం ప్రజలు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం స్టువర్టుపురం గ్రామంలో నేరాలు చేసే వారు లేరని.. ఈ సినిమా ద్వారా తమ గ్రామానికి చెడ్డ పేరు వస్తుందని వారు ఆరోపిస్తున్నారు. సినిమా విడుదలపై హైకోర్టును ఆశ్రయించామని.. మరో రెండు రోజులలో తీర్పు వచ్చిన తరువాత తదుపరి కార్యాచరణ ఉంటుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version