ఇండస్ట్రీలో ఏ హీరో కి అయినా విజయం పరాజయం అనేవి వస్తూ ఉంటాయి. ఇక ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడే వారు సినీ కెరీర్లో ప్రథమ స్థానంలో ఉంటారు అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఇలాంటి వారిలో చిరంజీవి, వెంకటేష్, బాలయ్య బాబు ముందుంటారు. కేవలం నటనతో ప్రేక్షకులను మెప్పిస్తారే తప్ప జయాపజయాల పై ఆధారపడరు. అందుకే నేడు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా చలామణి అవుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాదు ఈయన కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నట్లుగానే .. బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ లు కూడా ఉన్నాయి. తాజాగా విడుదలైన ఆచార్య సినిమా కూడా చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ గా మిగిలింది.
ఇకపోతే చిరంజీవి కెరీర్ లో ఏ సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి అనే విషయానికి వస్తే..
1. ఆచార్య:
కొరటాల శివ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్ గా రామ్ చరణ్, చిరంజీవి కలిసి నటించిన చిత్రం ఆచార్య. ఇక ఈ సినిమా ఇటీవల విడుదలై భారీ డిజాస్టర్ ను మూటగట్టుకుంది.
2. అంజి:
దర్శకత్వంలో చిరంజీవి హీరోగా శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర పూర్తిగా బోల్తా పడింది అని చెప్పవచ్చు.
3. శంకర్ దాదా జిందాబాద్:
చిరంజీవి హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో శంకర్ దాదా ఎం బి బి ఎస్ సినిమా కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తిస్థాయిలో డిజాస్టర్ గా మిగిలింది.
4. మృగరాజు:
చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ ను చవి చూసింది.
5. రిక్షావోడు:
కోడి రామకృష్ణ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
ఇక వీటితో పాటు ఎస్పి పరశురాం, బిగ్ బాస్ , స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ , లంకేశ్వరుడు , రాజా విక్రమార్క , త్రినేత్రుడు వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పూర్తి డిజాస్టర్ గా మిగిలాయి.