ప్రభాస్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా ఆది పురుష్.. ఈ సినిమా ఎట్టకేలకు ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నట్టు తెలుస్తోంది. రామాయణం పారాణిక చిత్రం కావడంతో ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడింది. ట్విట్టర్ వేదికగా ఈ సినిమా చూసిన అభిమానుల సైతం ఈ సినిమా గురించి తెలియజేయడం జరిగింది. అయితే ఈ సినిమా చూడడానికి గల ముఖ్య కారణాలను తెలుసుకుందాం.
మొదటిసారిగా ప్రభాస్ పారాణిక చిత్రంలో నటిస్తూ ఉండడం జరిగింది. అది కూడా రాముడు పాత్రలో కనిపించడంతో ఈ సినిమా చూడడానికి ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.
కృతి సనన్ జానకిగా నటించింది. ట్రైలర్ నుంచి సీత లుక్ అందరిని ఆకట్టుకుంది. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు.
రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా రూ.500 కోట్ల రూపాయలతో నిర్మించడం గమనార్హం.
ప్రపంచవ్యాప్తంగా ఆది పురుష్ 9000 పైగా స్క్రీన్ ని రిలీజ్ చేయడం విశేషం ముఖ్యంగా తెలుగులో 1500 మిగతా భాషలలో 4000 , ఓవర్సీస్ లో 3500 స్క్రీన్ ఈ సినిమాకి కేటాయించారు.
సినీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సినిమా టికెట్లు వేల సంఖ్యలో సినీ సెలెబ్రేటీలు సైతం కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది.
ఆది పురుష్ సినిమా విడుదలయ్యే ప్రతి థియేటర్లలో కూడా ఒక సీటును హనుమంతుడి కోసం కేటాయించడం గమనార్హం.
తెలుగు భాషలో తప్ప మిగతా అన్ని ఏరియాలలో కూడా ఆది పురుష్ చిత్రాన్ని నిర్మాతల స్వయంగా రిలీజ్ చేయడం జరిగిందట.
ప్రముఖ నగరాలలో ఆది పురుష్ సినిమా టికెట్ల ధరలు ఎక్కువగా ఉన్న ఈ సినిమా చూసేందుకు అభిమానులు చాలా ఆసక్తి చూపిస్తున్నారట. ఇవే కాకుండా ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ చాలా అద్భుతంగా నటించారని వార్తలు వినిపిస్తున్నాయి.