ఈ క్రికెటర్లు మామూలోళ్లు కాదుగా.. వారితో ఏకంగా..?

-

సినిమా రంగానికి – రాజకీయ రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉన్నట్టుగానే సినిమా రంగంలో ఉండే హీరోయిన్ లకి, క్రికెట్ రంగంలో ఉండే క్రికెటర్లకి కూడా మంచి ప్రేమ బంధం కొనసాగింది అనే చెప్పాలి. సౌరవ్ గంగూలీని మొదలుకొని నేటి యంగ్ క్రికెటర్ల వరకు చాలామంది హీరోయిన్లతో ప్రేమాయణం నడుపుతూ వార్తల్లో నిలిచిన వారు చాలామంది ఉన్నారు. ఈ క్రికెటర్లను చూస్తే మాత్రం నిజంగా మామూలోళ్ళు కాదు అని అనిపిస్తుంది. ఏకంగా స్టార్ హీరోయిన్లతో ఎఫైర్ నడిపి ఆ తర్వాత వారిని వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఇకపోతే అలా హీరోయిన్లతో ప్రేమాయణం నడిపి ఆ తర్వాత ఇంకొక పెళ్లి చేసుకున్న వారి గురించి ఇప్పుడు చూద్దాం.

బాలీవుడ్ హీరోయిన్ సారిక ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ మధ్య ప్రేమాయణం చాలా రోజులే నడిచింది. కానీ కొన్ని కారణాలవల్ల వీరిద్దరూ విడిపోయారు. ఇకపోతే రవి శాస్త్రి కూడా అమృత సింగ్ తో ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చాయి. రవిని అమృత బహిరంగంగా ముద్దు పెట్టుకోవడం అప్పట్లో సెన్సేషనల్ గా మారింది.అయితే అమృత ఆ తర్వాత బాలీవుడ్ నటుడు తనకంటే ఏడేళ్ల చిన్నవాడైన సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకోగా.. రవి శాస్త్రి మాత్రం రీతూ సింగ్ ను వివాహం చేసుకున్నాడు. ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా పెళ్లయిన తర్వాత ప్రముఖ హీరోయిన్ నగ్మాతో ప్రేమాయణం నడిపాడు. ఈ విషయం అప్పట్లో వివాదాస్పదంగా మారింది కానీ ఆమెను ఆయన కొద్ది రోజులకే దూరం పెట్టేశారు.

ఇక క్రికెట్లోకి అడుగు పెట్టిన తొలినాళ్లలోనే యువరాజ్ సింగ్ బాలీవుడ్ హీరోయిన్ కిమ్ శర్మతో ప్రేమలో పడ్డాడు. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరూ కొద్ది రోజులకే విడిపోయారు.

భారత జట్టులో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా పేరు తెచ్చుకున్న మహేంద్రసింగ్ ధోని కూడా బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు. మరొకవైపు బాలీవుడ్లో అడుగుపెడుతూనే సంచలనంగా మారిన దీపికా పదుకొనే పై ఎంతో ఆసక్తి కనపరిచారు ధోని.. ఆ తర్వాత కొద్ది రోజులకు లక్ష్మీరాయ్ తో కూడా ధోని ఎఫైర్ నడిపినట్లు సమాచారం. మరొకవైపు విరాట్ కోహ్లీ కూడా ఇషా బెల్లా, తమన్నా వంటి వారితో ఎఫైర్ నడిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version