నటుడు పృథ్వీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన ఇటీవల లైలా సినిమా ఫంక్షన్ వివాదస్పద వ్యాఖ్యలు మాట్లాడటంతో గత రెండు, మూడు రోజుల నుంచి ట్రోలింగ్ గా మారారు. ఆయన చేసిన వ్యాఖ్యలు నిర్మాతలు, హీరో విశ్వక్ సేన్ సారీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న హై బీపీతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు.
తాజాగా ఓ మీడియా ప్రతినిధిలో సంచలన వ్యాఖ్యలు మాట్లాడారు. “2029 లో నిన్ను లేపేస్తాం అంటూ బెదిరిస్తున్నారు. రాత్రి సమయంలో నా ఇంటి ముందు రెండు, మూడు కార్లు అటు ఇటు తిరుగుతున్నాయి. నా నెంబర్ ట్విట్టర్ లో పెట్టిన వారిపై రూ.కోటి పరువు నష్టం దావా వేశాను. మా తల్లి గురించి కొందరు ఎదవలు అసభ్యంగా మాట్లాడారు. అందుకే నాకు హై బీపీ వచ్చి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాను” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
2029 లో నిన్ను లేపేస్తాం అంటూ బెదిరిస్తున్నారు : పృథ్వీ
రాత్రి సమయంలో నా ఇంటి ముందు రెండు, మూడు కార్లు అటు ఇటు తిరుగుతున్నాయి
నా నెంబర్ ట్విట్టర్ లో పెట్టిన వారిపై రూ.కోటి పరువు నష్టం దావా వేశాను
మా తల్లి గురించి కొందరు ఎదవలు అసభ్యంగా మాట్లాడారు
అందుకే నాకు హైబీపీ వచ్చి… pic.twitter.com/Ae6MXqmHW7
— BIG TV Breaking News (@bigtvtelugu) February 12, 2025