వాటిని చూడాలి డ్రెస్ విప్పమన్నారు.. ఆమని షాకింగ్ కామెంట్స్ వైరల్..!

-

అలనాటి అందాల తార.. సీనియర్ హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నరేష్ హీరోగా వచ్చిన జంబలకడిపంబ సినిమాలో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయ్యి.. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుని తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ పెళ్ళాం సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఈ చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ ఫిలిం అవార్డు కూడా లభించింది. ఇక అలా తెలుగుతోపాటు తమిళ చిత్రాలలో కూడా నటించి మంచి పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి దూరం అయింది.

అయితే ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చి పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ అందరిని అలరిస్తోంది. ఈ క్రమంలోనే వినరో భాగ్యము విష్ణు కథ, అల్లంత దూరాన వంటి చిత్రాలలో నటించిన ఈమె తాజాగా సినీ ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆమని మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఉన్నప్పుడు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురవుతాయి. ఇది సహజం కానీ నిర్ణయం అనేది హీరోయిన్ పైన ఆధారపడి ఉంటుంది.

ముఖ్యంగా అప్పట్లో సోషల్ మీడియా ఉండేది కాదు కాబట్టి ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని హీరోయిన్లు ఎదుర్కొన్న ప్రతి సమస్య కూడా సోషల్ మీడియా ద్వారా బయట పెట్టవచ్చు. అయితే ఒకానొక సమయంలో తమిళ్ సినీ ఇండస్ట్రీలో నేను కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాను అంటూ ఆమె తెలిపింది. తమిళ సినిమా షూటింగ్లో భాగంగా ఒక స్విమ్మింగ్ పూల్ సన్నివేశం చేయాల్సి ఉంది. అందులో స్విమ్ డ్రెస్ వేసుకోవడానికి నా బాడీ పై స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో లేదో చూడడానికి డ్రెస్ విప్పమన్నారు.

దానికి నేను ఒప్పుకోలేదు. కొంతమంది కావాలనే ఇలా చేస్తారు. ఇక నేను వద్దనుకొని ఆ క్యారెక్టర్ నే మానేశాను. క్యారెక్టర్లు వచ్చినప్పుడు చేయడం, చేయకపోవడం మన ఇష్టం. హీరోయిన్స్ యొక్క వ్యక్తిగత నిర్ణయం కాబట్టి ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు అంటూ తాను కూడా ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యను వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version