గ్రామ సచివాలయాలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం

-

గ్రామ సచివాలయాలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ సచివాలయాల్లో RTI వ్యవస్థ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ సచివాలయాల్లో సమాచార హక్కు చట్టం అధికారుల నియామకానికి చర్యలు చేపట్టాలంటే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్ రాజశేఖర్ జీవో నెంబర్ 437 జారీ చేశారు.

ప్రభుత్వ కార్యక్రమాల్లో మరింత పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక అటు రేపు రిలీజ్ కానున్న మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతించలేదు. టికెట్ ధరలు పెంచాలని కోరుతూ వచ్చిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందని మరిన్ని వివరాలు కావాలని ప్రభుత్వం చిత్ర యూనిట్ ని కోరింది. ఏపీలో 20 శాతం చిత్రీకరణ…. హీరో, హీరోయిన్ రెమ్యూనరేషన్ కాకుండా రూ. 100 కోట్ల బడ్జెట్ వ్యయం తదితర వివరాలు ఈ దరఖాస్తుకు జత చేయలేదని, వాటిని ఇవ్వాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version