సామాన్య ప్రజలు థియేటర్ కి రాకపోవడానికి అసలు కారణం ఇదే..!

-

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాత మండలి స్ట్రైక్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంతసేపు ఉన్నా నిర్మాతలు.. హీరోలు పారితోషకం తగ్గించుకోవాలని చెబుతున్నారే తప్ప థియేటర్లలో పెంచిన స్నాక్స్ ధరల గురించి మాత్రం పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా సినిమా థియేటర్ కి వెళ్తే ప్రేక్షకుడికి ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా జేబుకి చిల్లుపడేలా చేస్తున్నారు . ఒక కుటుంబం సినిమాకి వెళ్ళాలి అంటే 1000 రూపాయలు కావాల్సిందే. ఇక స్నాక్స్ కి అదనంగా 500 రూపాయలు చెల్లించాలి. ప్రస్తుతం థియేటర్లలో టికెట్ ధరతో సమానంగా స్నాక్స్ ధరలు ఉండడంతో సామాన్యుడు థియేటర్ కు వెళ్లడం మానేస్తున్నాడు. అంతేకాదు థియేటర్ కి ఇప్పుడున్న పరిస్థితులలో వెళితే టికెట్ ధరలు ఆకాశాన్ని తాకడమే కాకుండా బైకు పార్కింగ్ కోసం, స్నాక్స్ కోసం ఇలా రకరకాల ఖర్చులు ఎక్కువవుతున్నాయి.

ఇకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కుటుంబంతో కలిసి ఒక సినిమా చూడడానికి థియేటర్కు వెళితే కచ్చితంగా 2000 రూపాయలు ఉండాల్సిందే .కానీ సామాన్య ప్రజలు ఇదే రూ.2000 ఉంటే సరుకులు వస్తాయి కదా అని ఆలోచించేవారు కూడా ఎక్కువ అవుతున్నారు అందుకే సినిమా థియేటర్లకు వెళ్లడం మానేశారు. ఇక అంతే కాదు సినిమా థియేటర్ లో విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలో వస్తుండడంతో ఇంట్లో సినిమా చూసి ఆనందిస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఈ పరిణామంతోనే థియేటర్ పరిశ్రమ కుదేలయింది ముఖ్యంగా రేట్లు పెంచుకొని నిర్మాతలు లాభ పడదామని అనుకుంటుంటే అసలు రేట్లకు సినిమాలే చూడమని ప్రేక్షకులు ముఖం చాటేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే సినీ పరిశ్రమ ప్రస్తుతం ఊబిలో కూరుకుపోతుందనే చెప్పాలి. ఇక ఆదాయం రాకపోవడంతో నిర్మాతలు కూడా సినిమా షూటింగులు బంద్ చేశారు.

మరీ ముఖ్యంగా కొన్ని థియేటర్లలో రూ.800 కి పైగా టికెట్ ఖరీదు నిర్ణయించడం జరుగుతుంది. నిజానికి ఒక థియేటర్ కి కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్తే అక్కడ ఉండే వ్యాపారస్తులు పాప్కాన్ రూ.300 , కూల్ డ్రింక్ రూ.250, వాటర్ బాటిల్ రూ. 110, సమోసాలు రూ. 120, పార్కింగ్కి రూ. 50 తడిసి మోపెడవుతుంది. అందుకే సినిమా థియేటర్లకు సామాన్యులు వెళ్లడం లేదని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version