టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత జి.వి.వి.రాజు సతీమణి పద్మజా రాజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆమె వయసు 54 సంవత్సరాలు. ఇద్దరు కుమారులు ఉన్నారు. నాటితరం అందాల హీరో హరనాథ్ కు పద్మజా రాజు కూతురు. ఆమె అన్న శ్రీనివాసరాజు కూడా నిర్మాతనే.
పద్మజారాజు భర్త జీ.వి.వి.రాజు, పవన్ కళ్యాణ్ హీరోగా ‘గోకులంలో సీత’, ‘తొలిప్రేమ’ వంటి చిత్రాలు నిర్మించారు. ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘గోదావరి’ కూడా తెరకెక్కించారు. ఇటీవల పద్మజారాజు తన తండ్రి హరనాథ్ గురించి ‘అందాల నటుడు’ పేరుతో ఓ పుస్తకం వెలుగులోకి తెచ్చారు. పద్మజారాజు మృతితో పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. జి.వి.వి.రాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.