‘డాకు మహారాజ్’ ట్రైలర్ రిలీజ్ కి టైమ్ ఫిక్స్..!

-

సాధారణంగా ప్రతీ ఏడాది సంక్రాంతి పండుగ అంటే అందులో సినిమా పండుగ ఉంటుంది. వీటిలో ముఖ్యంగా నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా అంటే ప్రత్యేకం అనే చెప్పాలి.  ప్రస్తుతం సంక్రాంతి రేస్ లో రిలీజ్ కి వస్తున్న సినిమాల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన చిత్రం డాకు మహారాజ్. ఈ చిత్రం నుంచి ఇటీవలే దబిడి దిబిడి సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో కాస్త వివాదం అయింది. వెంటనే నిర్మాత నాగవంశీ స్పందించారు.

ఈ సమయంలోనే  సినిమా ట్రైలర్ పై క్లారిటీ వచ్చేసింది. దీంతొో ఇండియాలో ఈ చిత్రం ట్రైలర్ జనవరి 5 ఉదయం 8 గంటల 39 నిమిషాలకి లాంచ్ చేస్తున్నట్టుగా తెలిపారు. ప్రస్తుతం 4న గ్రాండ్ గా యూఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తుండగా అక్కడ 4 న రాత్రి 9 గంటల 9 నిమిషాలకి లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి ఈ అవైటెడ్ ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version