ఒకే రోజు ఇన్ని సినిమాలా .. డబ్బులు సరిపోతాయా ?

-

ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బడా బడా హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’, దర్బార్, కళ్యాణ్ రామ్ నటించిన ‘ఎంత మంచివాడవురా’ సినిమా రిలీజ్ అయ్యాయి. వీటన్నిటిలో అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాకి మంచి హైప్ రావడంతో సినిమా కూడా అదే స్థాయిలో ఉండటంతో సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాల కంటే ఈ సినిమా అదరగొట్టే కలెక్షన్లతో సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

అయితే సంక్రాంతి వెళ్లి నెలరోజులు కాకపోయినా గానీ ఫిబ్రవరి 7వ తారీఖున ఏకంగా అరడజను సినిమాలు విడుదలవబోతున్నాయి. యంగ్ హీరో శర్వానంద్, సమంత జంటగా.. తమిళ నాట సంచలన విజయం సాధించిన ‘96’ సినిమాని తెలుగులో జాను అనే పేరుతో ఫిబ్రవరి 7వ తారీకున విడుదల కానుంది.

 

ఇదే తరుణంలో బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో ప్రొడక్షన్‌ నెంబర్‌ 1గా హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్న సినిమా ‘అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి’,‘సవారి’,‘అమృతారామమ్’..సినిమాలు విడుదల కానున్నయి. ఈ నేపథ్యంలో ఒకేసారి ఇన్ని సినిమాలు చూడాలంటే మా దగ్గర కూడా డబ్బులు ఉండాలి కదా అర్థం చేసుకోవాలి అని అంటున్నారు తెలుగు సినిమా ప్రేక్షకులు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version