డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీస్..!!

-

గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ పరిధిలో డ్రగ్స్ మాఫియా దందా ఎక్కువగా నడుస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి.. గత కొద్దిరోజుల క్రితమే కబాలి సినిమా నిర్మాత కె.పి చౌదరిని ఈ కేసులో అరెస్టు చేయడం కూడా జరిగింది. పోలీసులు ఇతన్ని విచారించిన తర్వాత పలు ఆసక్తికరమైన విషయాలను సైతం వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ రిపోర్టులో టాలీవుడ్ ప్రముఖులు సైతం ఉన్నట్లుగా కేపీ చౌదరి తెలియజేసినట్లు అధికారులు తెలియజేశారు. కేపీ చౌదరి మొబైల్లో దాదాపుగా 9000 ఫోటోలు ఉన్నాయని అందులో పలు రకాల కాంటాక్ట్ ను కూడా ఉన్నాయని అధికారులు తెలియజేశారు.

అతని మొబైల్లో 12 మంది సినీ సెలబ్రిటీలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఇందులో బిగ్ బాస్ బ్యూటీగా పేరుపొందిన ఆషు రెడ్డి, టాలీవుడ్ నటులు సురేఖవాణి ,జ్యోతి పేర్లు కూడా ఉన్నట్లుగా తెలుస్తున్నది. అంతేకాకుండా రిమాండ్ రిపోర్టులో కొంతమంది నేరస్థుల పేర్లు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇవే కాకుండా పలువురు సినీ సెలబ్రిటీలు రాజకీయ నేతల కుమారుల పేర్లు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో చాలాకాలంగా కేపీ చౌదరి డ్రగ్స్ వ్యవహారం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

అయితే ఈ పోలీస్ విచారణ అనంతరం కస్టడీలో ఉన్న కేపీ చౌదరి మీడియాతో మాట్లాడడం జరిగింది. తనపై వస్తున్నావని ఫాల్స్ అని ఎలాంటి తప్పు చేయలేదని తెలియజేశారు. తన మొబైల్లో ఉన్న కాంట్రాక్స్ ఫోటోలకు డ్రగ్స్ కేసుకి ఎలాంటి సంబంధం లేదని వాళ్లంతా తన ఫ్యామిలీ వాళ్ళని కేపీ చౌదరి తెలియజేయడం జరిగింది. మరి పోలీస్ కేసు విచారణలో కేపీ చౌదరికి లీకైన పేర్లకు పలు రకాల ట్రాన్సాక్షన్ జరిగినట్లుగా పోలీసు అధికారులు గుర్తించారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాలి అంటే మరో కొద్ది రోజులు విచారించాలని పోలీసులు తెలియజేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version