బ‌ర్త్ డే బోయ్ : ఉద‌యం లేదు కిర‌ణం లేదు కానీ..

-

క‌న్నీళ్లే ఉన్నాయి..కొన్నాళ్లకు అంతా అయిన‌వాళ్లే అయినా కూడా..కాస్త కూడా క‌నిక‌రించ‌ని జీవితాలే తారస‌ప‌డ‌తాయి..ఇప్పుడు క‌న్నీళ్లే క‌థ‌ల్లో ఉన్నాయి..వ్య‌థ‌ల్లో ఉన్నాయి..ఆ తీరం చెంత ఉద‌య్ కిర‌ణ్ మ‌న మ‌న‌సంతా నిండిపోయారు మీ పుట్టిన్రోజు.. చెప్ప‌వే ప్రేమ చెలిమి చిరునామా అని పాడుకుంటూ..మ‌న‌సంతా నువ్వే సినిమాలో ఆంజనేయ స్వామిని మీరు న‌మ్ముకున్న విధంగానే మేం కూడా న‌మ్ముకుంటూ..మీ స్మ‌ర‌ణ‌లో మీ సినిమాల్లో మీ జ్ఞాప‌కాల్లో ఉండిపోతాం ఉద‌య్..హ్యాపీ బ‌ర్త్ డే ఉద‌య్..

ప్రేమ ఎలా ఉంటుంది ? తెలియ‌దు.. కానీ తెలిసీ తెలియ‌ని వయ‌స్సులో ప్రేమేంటి అని న‌వ్వుకునే క‌థ‌లు కొన్ని ఉంటాయి. కానీ ఆ కథ‌ల‌కూ ఓ కమ‌ర్షియ‌ల్ వాల్యూ ఉంది. అయినా కూడా అవి సినిమా వ‌ర‌కూ ప‌నికి వ‌చ్చిన క‌థ‌లు.. ఫ‌క్తు సినిమా క‌థలే ! ఇప్పుడంటే మ‌న పోర‌గాళ్ల‌కు ఓవ‌ర్ మెచ్యూర్టీ వ‌చ్చేసింది క‌నుక ఆ క‌థ‌ల‌ను యాక్సెప్ట్ చేయ‌రేమో కానీ అప్ప‌ట్లో ఆ క‌థ‌లే గొప్ప విజ‌య సూత్రాలుగా రాణించాలి.. ఆవిధంగా చిత్రం కానీ నువ్వు – నేను కానీ మంచి విజ‌యాలు సాధించి బాక్సాఫీసు వ‌ద్ద వ‌సూళ్ల సునామీనే సృష్టించి వెళ్లాయి.ఆ విధంగా ఉద‌య్ కిర‌ణ్ అనే కుర్ర క‌థానాయ‌కుడి పేరు మార్మోగిపోయింది. ప్చ్ ! 3 సినిమాలు వ‌రుస మూడు సినిమాల విజ‌యం త‌రువాత, సంబంధిత సంబ‌రాల త‌ర్వాత ఆ కుర్ర హీరో ఏమ‌యిపోయారో ! త‌రువాత కూడా సినిమాలు చేశారాయ‌న కానీ క‌న్నీళ్ల‌ను మిగిల్చి ఆఖరికి మ‌న మ‌ధ్య లేకుండా పోయారాయ‌న ! సినిమా నుంచి జీవితం వ‌ర‌కూ ఉద‌య్ కిర‌ణ్ ఓ గెలుపున‌కు..ఓ ఓట‌మి..కి ప్ర‌తినిధి అయ్యారు. ప్ర‌తీక అయ్యారు. డియ‌ర్ ఉద‌య్ వి మిస్ యూ..

ఆడిష‌న్స్ ప్లీజ్ అని అన్నారు తేజా.. చ‌దువుకుంటున్న కుర్రాడు చిత్రం అంటూ తెర‌పైకి వ‌చ్చాడు. డు కాదు రు.. క్ష‌మించాలి ఉద‌య్ ..మీరు.. ఆయ‌న‌కు ఆ రోజు ప‌ది వేలు రూపాయ‌లు మాత్ర‌మే ఇచ్చార‌ని విన్నాను. అంత త‌క్కువ మొత్తంలో అడ్వాన్సు అందుకుని సినిమాను ఓ స్థాయిలో నిలిపారాయ‌న. చిత్రం పెద్ద హిట్. ఆయ‌న పెద్ద స్టార్ అయిపోవాలి. అయిపోయారు. కానీ ఆ చిత్ర నిర్మాత, మీడియా మొఘ‌ల్ రామోజీ స‌ర్ మ‌రో సినిమా ఆయ‌న‌తో చేయ‌లేదు.

త‌రువాత ఆఫ‌ర్ జెమినీ కిర‌ణ్ నుంచి వచ్చింది. హీరో ఉద‌య్ కిర‌ణ్.. ముందు ఎవ‌రెవ‌రిని అనుకున్నారో లేదో తెలియ‌దు కానీ ఆ సినిమా పేరు నువ్వూ నేను. హీరోయిన్ అనిత.. ఆ సినిమా కూడా పెద్ద హిట్.. తేజ మంచి డైరెక్ట‌ర్ అవునో కాదో కానీ సినిమా ప‌రంగా మంచి డ‌బ్బులే వ‌చ్చాయి.. ఆ త‌రువాత మ‌న‌సంతా నువ్వే హ్యాట్రిక్ హిట్ .. ఎంత గొప్ప‌గా తీశారో ఈ సినిమా…ఇప్పుడంటే ఎంఎస్.రాజు నుంచి ఏవే సినిమాలు వ‌స్తున్నాయి కానీ ఆరోజు ఆయ‌న ఓ కొత్త ద‌ర్శ‌కుడు (వీఎన్ ఆదిత్య)తో ఎంత గొప్ప సినిమా తీశారు ! అని సంబ‌రప‌డిపోయారు తెలుగు ప్రేక్ష‌కులు మ‌రియు ఫ‌క్తు సినిమా ప్రేమికులు.. ఆత‌రువాత ఆయ‌న కొన్ని సినిమాలు చేశారు.కానీ విజ‌యాలు త‌క్కువ అయిపోయాయి. తరువాత అవ‌కాశాలూ త‌గ్గిపోయాయి. ఏదో ఒక‌టి జ‌రిగే ఉంటుంది. ఆఖరికి ఆయ‌న జీవితాన ఆఖ‌రి నిర్ణ‌యం పెనువిషాదం..అదే ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణం అయింది.

హీరో ఉద‌య్ కిర‌ణ్ పుట్టిన్రోజు. మంచి కెరియ‌ర్ తో హాయిగా ఉండాల్సిన రోజు. పాపం ఆయ‌న మ‌న మ‌ధ్య లేరు. ఒక త‌రం ఆయ‌న్ను చూసి ఎంత‌గా ఇష్ట‌ప‌డింద‌ని ? పాపం ఆయ‌న మ‌న మ‌ధ్య లేరు ! ఆయ‌న్ను చూసి హీరో ఎలా అయినా ఉండ‌వ‌చ్చు అని నేర్చుకున్నారు కూడా ! ఏం కాదు హీరోలంటే ఏదో పై నుంచి ఊడిప‌డ్డ‌వారు కాదు అని ఆయ‌న నిరూపించారు. ఆయ‌న అమాయ‌త్వంతో కొన్ని పాత్ర‌ల‌ను బాగా పోషించారు. ఆ గొంతు కూడా అలానే ఉండేది. డైలాగ్ బాగా చెప్పారా లేదా అన్న‌ది కాదు కానీ సొంత గొంతుకుతోనే ఆయ‌న నెగ్గుకు రావాల‌ని ప‌రిత‌పించేవారు. ఆఖ‌రికి బాల చంద‌ర్ లాంటి వారి సినిమాలో కూడా ఆయ‌న త‌ళుకులీనారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version