ఊర్వ‌శివో రాక్ష‌సివో ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పేశారు -స్ట్రీమింగ్ ఎప్పుడంటే

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో… అల్లు శిరీష్ “ఊర్వశివో రాక్షసివో” అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాకి విజయ్ – విరాజ్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.

అచ్చు రాజమణి సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రానికి రాకేష్ శశి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని నవంబర్ 4వ తేదీన విడుదల చేయగా…మంచి విజయాన్నే అందుకుంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. “ఊర్వశివో రాక్షసివో” ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ అయింది. డిసెంబర్‌ 9వ తేదీన ఆహాలో రిలీజ్‌ కానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version