బండి సంజయ్ వారిని రప్పించు.. 48 గంటల్లో బీఆర్ఎస్ నాయకులను బొక్కలో వేస్తా : సీఎం రేవంత్ రెడ్డి

-

ప్రజలు తిరస్కరించినా కేసీఆర్లో  మార్పు రాలేదని, ఫామ్ హౌస్ లో కూర్చుని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి  మండిపడ్డారు. ఆయన అవసరం రాష్ట్రానికి లేదని ప్రజలు తీర్పు ఇచ్చారని, ఈ రాష్ట్రంతో పేగుబంధం తెంపుకుంటూ పార్టీ పేరు కూడా మార్చుకున్నారని విమర్శించారు. ఇవాళ నిజామాబాద్ లో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారంలో సీఎం మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధులే లేరని.. రాజకీయ పార్టీగా చెప్పుకునే అర్హత ఆ పార్టీకి ఉందా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేయనివాళ్లకు తమను ప్రశ్నించే అర్హత ఎక్కడిదని అన్నారు. నిరుద్యోగులను పదేళ్లపాటు అనాథలుగా తిప్పింది బీఆర్ఎస్ కాదా? అని, తాము వచ్చాక 55,163 నియామకాలు చేపట్టింది. నిజం కాదా? అని అన్నారు.

పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కేసీఆర్ రూ. 8వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు, శ్రవణావు అమెరికా పారిపోతే ప్రధాని మోడీ, కేంద్రమంత్రి బండి సంజయ్  లేఖ రాసి ఎందుకు స్వదేశానికి తీసుకురావడం లేదని సీఎం ప్రశ్నించారు. ఈ కేసులో కేసీఆర్, కేటీఆర్  అరెస్ట్ కాకుండా కాపాడుతున్నదే కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ అని ఆరోపించారు. ‘ఎప్పుడు అమెరికా నుంచి తీసుకువస్తారో చెప్పండి. రాష్ట్రానికి తెచ్చిన 48 గంటల్లో బీఆర్ఎస్ నాయకులను బొక్కలో
వేస్తాం’ అని రేవంత్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version