విజయ్ ‘వారసుడు’ రిలీజ్ డేట్ ఫిక్స్ !

-

విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న వారసుడు అనే సినిమాతో మొదటిసారిగా డైరెక్టుగా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలలో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ క్రమంలోని ఈ సినిమా కోసం విజయ్ దాదాపుగా రూ.100 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తమిళ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే దీంతో దిల్ రాజు ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నాడు అని కామెంట్లు కూడా ఎక్కువగా వినిపించాయి. ఇది ఇలా ఉండగా.. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న వారసుడు మూవీకి సంబంధించి కేవలం రెండు సాంగ్స్, అలానే రెండు యాక్షన్ సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయని, వాటిని రేపటినుండి జరగనున్న లాస్ట్ షెడ్యూల్ లో పూర్తి చేస్తాం అంటూ నిర్మాతలు కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించారు. అలానే మూవీని పక్కాగా 2023 పొంగల్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్లుగా వారు తమ పోస్టులో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version