VD12 : పోలీస్ గెటప్ లో విజయ్ దేవరకొండ !

-

లైగెర్ సినిమా ఇటు పూరి జగన్నాథ్ ను అలాగే విజయ్ దేవరకొండ ను బాగా దెబ్బ కొట్టింది. ప్రస్తుతం విజయ్, సమంత తో ఖుషి సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం సమంత ఆరోగ్యం దెబ్బతినడం వల్ల షూటింగ్ కూడా సాధ్యం కావడం లేదు ఇక ఎప్పుడూ సమంత వస్తే అప్పుడే షూటింగ్ స్టార్ట్ అయ్యేలా ఉంది. దీనితో విజయ్ ఫుల్ ఖాళీగా ఉన్నాడు.

ఈ ఖాళీ సమయంలో కొంత మంది దర్శకుల కథలు విన్నాడు. అయితే, తాజాగా మరో సినిమాతో విజయ్‌ దేవరకొండ వచ్చేశాడు. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో.. VD 12 పేరుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ బ్యానర్‌ పై తెరకెక్కుతోంది.  ఈమేరకు ఓ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. ఇక ఈ పోస్టర్‌ విషయానికి వస్తే, ఇందులో పోలీస్‌ గెటప్‌ లో విజయ్‌ నటిస్తోన్నట్లు పోస్టర్‌ చూస్తే,  తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version