గత వైసీపీ సర్కార్ హయాంలో తాను ఎంతో ఇబ్బందులకు గురయ్యానని.. తనకు రావాల్సిన డబ్బులు రాకుండా అడ్డుకున్నారని.. దాంతో అప్పుల పాలయ్యానని మనోవేదనతో తెలుగుదేశం పార్టీ నాయకుడు కారంపూడి రవీంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను పడిన బాధను వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. 12 ఏళ్లుగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని.. అది భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వెల్లడించాడు.
ఈ ఘటన విజయవాడలోని గొల్లపూడిలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. తెలుగు తమ్ముళ్లు కారంపూడి ఆత్మహత్యను జీర్ణించుకోలేకపోతున్నారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా మంది టీడీపీ నేతలు హత్యకు గురయ్యారని, కొందరు వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. కారంపుడి మృతిపై ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరుతున్నారు.
విజయవాడ: అప్పలు బాధలు, వేధింపుల కారణంగా గొల్లపూడిలో టీడీపీ నాయకుడు కారంపూడి రవీంద్ర ఆత్మహత్య..
బాధను వివరిస్తూ వీడియో విడుదల చేసి ఆత్మహత్య చేసుకున్న రవీంద్ర.
12 ఏళ్లుగా ఆర్ధికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాను.
వైసీపీ ప్రభుత్వంలో నాకు రావాల్సిన డబ్బులు రానివ్వకుండా అడ్డుకున్నారు.
-… pic.twitter.com/lg96aVUzDo— ChotaNews (@ChotaNewsTelugu) November 20, 2024