రవితేజకు బిగ్‌ షాక్‌..రామారావు ఆన్‌ డ్యూటీ నుంచి వీడియో లీక్‌ !

-

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా “రామారావు ఆన్ డ్యూటీ”. శరత్ మండవ దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఈ సినిమాను s.l.v. సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా… దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో కనువిందు చేయనున్నారు. యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా జూలై 29 వ తేదీన అంటే రేపే అన్ని థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బృందానికి బిగ్‌ షాక్‌ తగిలింది. సినిమా విడుదల కంటే ఒక్క రోజు ముందుగానే, ఈ మూవీ నుంచి ఓ బిట్టు వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. దీంతో చిత్ర బృందం షాక్‌ కు గురైంది. దీనిపై పోలీసులను ఆశ్రయించాలనే ఆలోచన చేస్తోంది చిత్ర బృందం.

Read more RELATED
Recommended to you

Exit mobile version