విజయ్ ఆంటోనీ ఆరోగ్య పరిస్థితి విషమం.. అసలు విషయం చెప్పిన హీరో భార్య

-

విజయ్ ఆంటోనీ.. తమిళ ఇండస్ట్రీలో ఈపేరు తెలియని వారుండరు. కానీ టాలీవుడ్ లో మాత్రం ఈ హీరో పేరు బిచ్చగాడు సినిమాతోనే తెలిసింది. ఆ సినిమాకు తెలుగు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఆ చిత్రంతో ఈ హీరో తెలుగు సినీ అభిమానుల గుండెల్లో తిష్టవేసుకుని కూర్చున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో ముఖం మొత్తిన తెలుగు ప్రేక్షకులకు విజయ్ ఓ డిఫరెంట్ సినిమాను చూపించాడు.

తాజాగా బిచ్చగాడు సినిమా సీక్వెల్ బిచ్చగాడు-2 షూటింగ్ కోసం మలేసియా వెళ్లాడు. అయితే ఈ షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు విజయ్ కు ప్రమాదం జరిగింది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా హుటాహుటిన చెన్నై నుంచి మలేసియా వెళ్లారు. అక్కడి నుంచి ఆమె విజయ్​ను చెన్నైకి తరలించారు. అయితే విజయ్ ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉందని.. వెంటనే ఆయణ్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Powered By
Video Player is loading.

“మలేసియాలోని లంకావీ దీవిలో బిచ్చగాడు-2 షూటింగ్ జరుగుతోంది. ఓ సీన్ కోసం విజయ్ ఆంటోనీ చాలా వేగంగా వాటర్​ బైక్ డ్రైవ్ చేశారు. అదుపు తప్పి కెమెరా ఉన్న పడవను ఢీకొట్టారు. విజయ్​ నీటిలో పడిపోయారు. ఆయనకు ఈత రాదు. మునిగిపోతూ చాలా నీళ్లు తాగేశారు. వెంటనే సిబ్బంది ఆయన్ను కాపాడి ఆస్పత్రికి తరలించారు. విజయ్ ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. పళ్లు విరిగాయి. ఆస్పత్రికి వెళ్లే సరికి ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు” అని బిచ్చగాడు-2 షూటింగ్​లో భాగమైన ఓ వ్యక్తి మీడియాకు తెలిపారు.

మీడియాలో వస్తున్న వార్తలు చూసి తమిళ ప్రజలతో పాటు తెలుగు అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో విజయ్ భార్య ఫాతిమా ఆయన ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చింది.  తన భర్త ఆరోగ్యం గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అంటూ పుకార్లను కొట్టి పారేసింది.
తుంటికి గాయం అవ్వడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు తప్ప ఆయన ఆరోగ్యం విషమంగా లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఆమె ప్రకటనతో విజయ్ ఆంటోనీ ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version