విశాల్ రత్నం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..!

-

తమిళ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. విశాల్ ఎక్కువగా మాస్ సినిమాలు చేస్తుంటాడు. తాజాగా మాస్ సినిమాల దర్శకుడు హరి తెరకెక్కించిన రత్నం మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యముడు, సింగం సిరీస్ ఫేమ్ దర్శకుడు హరి దర్శకత్వంలో వచ్చిన రత్నం మూవీలో ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది. సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కీలకపాత్రలు పోషించారు.

ఈ సినిమా రిలీజ్కు ముందు వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 26న థియేటర్లలో రిలీజ్ అయింది. ఫుల్ యాక్షన్ సీన్లతో రూపొందిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు. ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు సిద్ధం అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ‘రత్నం’ డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకోగా.. మే 23 నుంచి తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులోకి రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version