VSR: నెగిటివ్ రోల్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్..!

-

తమిళ్ సినీ ఇండస్ట్రీలో మొదట హీరోయిన్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత అక్కడ కలిసి రాక తెలుగులో నెగిటివ్ పాత్రలు చేస్తూ దూసుకుపోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2021 లో క్రాక్ సినిమాలో ఈమె చేసిన జయమ్మ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఆ మూవీకి దర్శకత్వం వహించిన గోపీచంద్ మలినేని మరొకసారి వీరసింహారెడ్డి సినిమాలో కూడా అలాంటి పాత్రనే వరలక్ష్మీ శరత్ కుమార్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి సినిమా ఈనెల 12వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే తాను చేసే నెగటివ్ రోల్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది వరలక్ష్మి శరత్ కుమార్.

ఇప్పటివరకు లేడీ విలన్ గా తెలుగు, తమిళ్ సినిమాలలో వరుసగా మూవీలు చేస్తూ దూసుకుపోతున్న ఈమె.. తాజాగా లీడ్ రోల్ పోషించిన శబరి చిత్రం కూడా రిలీజ్ కి సిద్ధమవుతోంది. అలాగే గత ఏడాది చివర్లో సమంత పోషించిన యశోద సినిమాలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ నెగిటివ్ రోల్ లో ప్రేక్షకులను మెప్పించిన తీరు ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇకపోతే గ్లామర్ రోల్స్ కి దూరంగా ఉంటూ.. కేవలం నెగిటివ్ రోల్స్ చేయడంపై ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఇలా స్పందించింది.. వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ..” గ్లామర్ రోల్స్ నాకు సూట్ అవ్వవని నా అభిప్రాయం.. అందుకే వాటికి దూరంగా ఉంటున్నాను.. నాకు నెగిటివ్ రోల్స్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే నేను గ్లామర్ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నాను.. అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ స్పష్టం చేసింది.

ప్రస్తుతం వీర సింహారెడ్డి మూవీ ట్రైలర్ లో వరలక్ష్మీ శరత్ కుమార్ కొన్ని క్షణాలే కనిపించింది. ” పగోడు పంపుతున్న పసుపు కుంకాల తో బతుకుతుంటే ముత్తైదువలా లేను.. ముండమోపిలో ఉన్నా..” అంటూ మెయిన్ విలన్ దునియా విజయ్ ను రెచ్చగొట్టే క్యారెక్టర్ లో ఆమె కనిపించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version