ఓటీటీ.. డిజిట‌ల్ కంటెంట్‌..న్యూస్ పోర్ట‌ల్స్‌కు సెన్సార్‌!

-

కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ పోర్టల్స్ మరియు కంటెంట్ ప్రొవైడర్లకు సంబంధించిన విప్లవాత్మక సంస్కరణను తీసుకువచ్చింది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోనికి వెబ్‌సైట్లు, కంటెంట్ ప్రొవైడర్లు – ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్‌లను తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ సంతకం చేసిన నోటిఫికేషన్‌ని విడుదల చేసింది.

దీనితో ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్‌లు సంప్రదాయ మీడియా హౌస్‌లతో పాటు – ప్రింట్ మరియు బ్రాడ్‌కాస్ట్ మీడియా హౌస్‌ల‌ని ఒకే విధంగా ట్రీట్ చేయ‌బ‌డుతుంది. ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్ మరియు కంటెంట్ ప్రొవైడర్లకు (హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ లు) ఇదే నిబంధనలు వర్తిస్తాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్ల‌డికానున్నాయి.

స్వయం ప్రతిపత్తి గల ఓటిటీ ప్లాట్‌ఫామ్‌లను నియంత్రించాలని సుప్రీంకోర్టులో గత నెలలో పిటిషన్ దాఖలు చేసిన తరువాత తాజా నిర్ణ‌యాన్ని కోర్టు ప్ర‌క‌టించింది. అపెక్స్ కోర్టు దీనిపై కేంద్రం స్పందన కోరింది. కేంద్రం, ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ మరియు ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం డిజిటల్ కంటెంట్‌ను నియంత్రించే చట్టం కానీ స్వయంప్రతిపత్త సంస్థ కానీ లేదని కేంద్రం తెలిపింది. దీంతో ఓటీటీలను.. ఆన్‌లైన్ పోర్టల్‌లను : అండ్ బీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version