వామ్మో.. అల్లు అర్హ రేంజ్ మామూలుగా లేదుగా..?

-

అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి అర్హకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను పోస్ట్లు చేస్తూ ఉంటుంది. ఇక ఈ చిన్నారికి సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి. ఇటీవలే శాకుంతలం సినిమాలో చిన్నప్పటి భరతుడి పాత్రలో నటించి తన ముద్దు ముద్దు మాటలతో నటనతో అందరిని ఆకట్టుకున్న ఈ చిన్నారి ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాలో కూడా నటించబోతోంది.. ఇకపోతే ఈ సినిమాకి అర్హ రెమ్యూనరేషన్ నిమిషానికి రూ .2 లక్షలు అని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా వస్తున్న సినిమా దేవర. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేయగా.. అందుకు మంచి రెస్పాన్స్ లభించిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఐదవ షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది.

ఇకపోతే ఈ సినిమాలో జాన్వి కపూర్ చిన్నప్పటి పాత్ర కోసం అల్లు అర్జున్ కూతురు అర్హ ను చిత్ర బృందం అడిగారని సమాచారం. స్వయంగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ కి ఫోన్ చేసి అర్హ ను తీసుకుందామని కొరటాల శివ అంటున్నాడు అని అడగ్గా.. వెంటనే అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పేసారట. ఇకపోతే వచ్చే నెలలో అల్లు అర్హ పాత్రకు సంబంధించి.. షూటింగ్ కార్యక్రమాలను కూడా పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇందులో ఈ పాప పాత్ర కేవలం 10 నిమిషాలు అని.. అందుకోసం రూ.20 లక్షల పారితోషకం తీసుకుంటుందని సమాచారం. ఇది తెలిసి అది అర్హా రేంజ్ అంటూ అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version