రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం “కూలీ”. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. కూలి సినిమాను సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కాకుండా స్టాండ్ అలోన్ ఫిల్మ్ గా రూపొందించారు. కూలి సినిమాలో నాగార్జున నెగిటివ్ రోల్ లో నటించారు. వీరితోపాటు ఉపేంద్ర, శృతిహాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహీర్ కీలక పాత్రలలో నటించారు.

అయితే ఈ సినిమా… మొదటి రోజు కలెక్షన్స్ ను అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ 151 కోట్లు. వరల్డ్ వైడ్ గా ఈ మొత్తం కలెక్షన్ వచ్చినట్లు పేర్కొంది చిత్ర బృందం. ఈ మేరకు పోస్టర్ కూడా వదిలింది. సినిమాపై కొంతమేర ట్రోలింగ్ జరిగినప్పటికీ… సినిమాకు మాత్రం మంచిగానే కలెక్షన్స్ వచ్చాయి.