ఐస్‌ బాత్‌ చేస్తున్న హీరోయిన్లు.. అసలు ఎందుకు..? దీనివల్ల ఏం ప్రయోజనం..?

-

ఫిట్‌గా ఉండేందుకు యాక్టర్స్‌, క్రికెటర్స్‌ చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్‌కు వెళ్తుంటారు, కంప్లీట్‌ హెల్తీ డైట్‌ను మెయింటేన్‌ చేస్తారు. వాటర్‌ కూడా స్పెషల్‌వి తాగుతుంటారు. ఒక్కరు స్టాట్‌ చేస్తే. అది అలా అలా ట్రెండ్‌ అయిపోతుంది. ఒకరి తర్వాత ఒకరు మొదలుపెడతారు. ఈ మధ్య హీరోయిన్స్‌ అందరూ ఐస్‌బాత్‌ చేస్తున్నారు. సమంత, ప్రజ్ఞా జైస్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ ఇలా ఎంతోమంది హీరోయిన్లు ఐస్ బాత్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఆ వీడియోలను, ఫోటోలను తమ ఇన్‌ స్టా ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నారు. గడ్డకట్టే చలిలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఐస్ నీళ్లతో స్నానం చేయడమే ఐస్ బాత్. కొన్ని నిమిషాల పాటు ఆ ఐస్ నీళ్లలో అలా కూర్చొని బయటికి వచ్చేస్తే చాలు, ఐస్ బాత్ పూర్తవుతుంది. ఇలా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద శరీరాన్ని కాసేపు సేద తీరేలా చేయడం ఈ ఐస్ బాత్ ప్రక్రియ. బాలీవుడ్ హీరో హీరోయిన్లు, టాలీవుడ్ సెలెబ్రిటీలు, క్రీడాకారులు ఇలా ఎంతోమంది ఐస్ బాత్ చేస్తున్నారు. సమంత బాలి ట్రిప్‌లో మైనస్ 4 డిగ్రీల ఉష్ణోగ్రతలో 6 నిమిషాల పాటు ఐస్ బాత్ చేసింది. ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ ఒక్కసారి చేస్తే శరీరానికి ఎంతో ఆరోగ్యం. సాధారణంగా చల్లని నీటితో స్నానం చేయడమే కొంచెం కష్టం. ఇప్పుడు అందరూ గోరువెచ్చని నీళ్లు, వేడినీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడుతున్నారు. అలాంటిది మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటితో నిమిషాల పాటు ఉండడం అంటే చాలా కష్టం. గడ్డకట్టుకుపోయినట్టు అవుతుంది. అయితే ఈ ఐస్ బాత్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండడంతో ఈ పద్ధతిని ఎక్కువ మంది పాటిస్తున్నారు.

ప్రయోజనాలు..

వ్యాయామాలు అధికంగా చేసినా, పనులు శారీరక శ్రమ అధికంగా ఉన్నా కండరాల నొప్పులు వస్తాయి. ఐస్ బాత్ చేయడం వల్ల కండరాల నొప్పులు తగ్గుతాయి. కండరాలు రిలాక్స్‌ అవుతాయి. అలాగే అలసట, నీరసం, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడేవారు కూడా ఐస్ బాత్ చేస్తూ ఉండాలి. ఇది ఆ సమస్యలను తగ్గించేందుకు పనిచేస్తుంది. మన కేంద్ర నాడీ వ్యవస్థ ఉత్తేజితమయ్యేలా చేస్తుంది. శరీరం చురుగ్గా మారి ఒత్తిడి బారిన పడకుండా ఉంటుంది.

ఐస్ బాత్ చేయడం వల్ల చర్మానికి కూడా ఎంతో మంచిది. చెమట, జిడ్డు వంటివి పోయి చర్మానికి ఫ్రెష్‌గా తయారవుతుంది. మీకు ఉత్సాహంగా అనిపిస్తుంది. ఐస్ బాత్ చేసేటప్పుడు శరీరంలో హ్యాపీ హార్మోన్‌ డోపమైన్ విడుదలవుతుంది. ఇది మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థకు, రోగ నిరోధక వ్యవస్థకు కూడా ఐస్ బాత్ ఎంతో మేలు చేస్తుంది. ఈ వ్యవస్థల పనితీరును పర్యవేక్షించే వేగస్ నాడికి ఈ ఐస్ బాత్ ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి అప్పుడప్పుడు ఐస్ బాత్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదట.

ఈ సమస్యలు ఉంటే వద్దు..

తగిన జాగ్రత్తలు తీసుకుని ఐస్ బాత్ చేయడం మంచిది. ఎందుకంటే గుండె జబ్బులు ఉన్నవారు ఇలాగా హఠాత్తుగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతకు శరీరాన్ని ముంచడం మంచిది కాదు. అధిక రక్తపోటు ఉన్నవారు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఐస్ బాత్ చేయకపోవడమే ఉత్తమం అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version