మంచు మనోజ్ పై విష్ణుకు ఎందుకు అంత కోపం..?

-

అన్నయ్య అంటే తమ్ముడు కి కావాల్సిన అన్ని అవసరాలను తీర్చడమే కాదు వారికి అన్ని విషయాలలో కూడా తోడుగా ఉండాలి. కానీ మంచు మనోజ్ విషయంలో మాత్రం మంచు విష్ణు చాలా విభిన్నంగా ప్రవర్తిస్తున్నాడని తెలుస్తోంది. ఇటీవల మంచు మనోజ్ రెండవ పెళ్లి చేసుకోగా ఆయన పెళ్లిని దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత మంచు విష్ణు కి ఉంది కానీ ఆయన మాత్రం చుట్టం చూపులా తన కుటుంబ సభ్యులతో వచ్చి నాలుగు అక్షితంలు వేసి కేవలం 15 నిమిషాలు కూడా ఉండకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఫిలింనగర్ లో ఇదే సెన్సేషనల్ హాట్ టాపిక్ గా మారింది.

తమ్ముడు పెళ్లికి వచ్చి కనీసం భోజనం కూడా చేయకుండా వెళ్లడం ఏంటి అంటూ మంచు విష్ణు పై ట్రోలర్స్ విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు మంచు లక్ష్మి తన తమ్ముడి బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తించింది అంటూ ఆమెపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే విష్ణు కి తమ్ముడు మనోజ్ అంటే ఎందుకు అంత కోపం అనే విషయంపై ఎప్పటికప్పుడు రకరకాల వార్తల వైరల్ అవుతూనే ఉంటాయి.. నిజానికి విష్ణు నుండి ఇప్పటివరకు మంచు మనోజ్ పెళ్లికి సంబంధించి ఒక పోస్ట్ కూడా పడలేదు.. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా.. మొన్న మధ్యనే మంచు విష్ణు మా ఎన్నికలలో పోటీ చేస్తే తన వంతుగా ఏవైతే చేయాలో అవన్నీ దగ్గరుండి మరీ చేశారు మంచు మనోజ్.ఒకవేళ ఆరోజు పోలింగ్ బూత్ వద్ద మంచు మనోజ్ లేకపోయి ఉండి ఉంటే ఆ స్థానం రణరంగంగా మారేది.

.

అయితే ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య ఆస్తి పంపకాల విషయంలోనే గొడవలు జరిగి విడిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఒక ఇంట్లో మనుషుల మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ ఇలాంటి శుభకార్యాలకు వచ్చినప్పుడు కలిసి ఉండాలి… కానీ మంచు కుటుంబంలో ఐకమత్యమే లేదు.. వీళ్ళు అలా ఉండడం చూసి ప్రతి ఒక్కరు వీరిని చాలా తక్కువ చేసి చూస్తున్నారు అనడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version