ఎప్పటికైనా రాజమౌళి – సుకుమార్ మధ్య గొడవ తప్పదా..?

-

ఇకపోతే దేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమాలో ఎవరైనా హీరోలుగా నటించారంటే తప్పకుండా వారు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంటారు అనడంలో సందేహం లేదు. ఇకపోతే తన మేకింగ్ తో ఇండియన్ సినిమా స్టాండర్డ్ నే పెంచిన డైరెక్టర్ రాజమౌళి .. లార్జ్ స్కేలు సినిమాలు, హ్యూజ్ విజువల్ ఎఫెక్ట్ తో ఆయన సినిమాలు చేస్తూ ఉంటారు అనడంలో సందేహం లేదు. ఇకపోతే పాన్ ఇండియా మొత్తం నేడు రాజమౌళికి జై కొడుతోందని చెప్పడంలో సందేహం లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని దేశం గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్లాడు అంటే అది కేవలం రాజమౌళి కే సాధ్యమని చెప్పవచ్చు.

ఇకపోతే ఇలాంటి రాజమౌళికి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మరో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. ఇక స్వయంగా జక్కన్నే.. సుకుమార్ తో పోటీ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే సుకుమార్ స్థాయి ఏంటో మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే సుకుమార్ పుష్ప సినిమాతో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టకుండానే బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ఇప్పుడు పుష్ప 2 సినిమా మీద అటు బాలీవుడ్ కూడా ఎక్కువగా తన దృష్టిని సుకుమార్ సినిమా వైపే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో టాప్ 3 రికార్డులను కదిలించడం కూడా గ్యారెంటీ అని తెలుస్తూ ఉండడం గమనార్హం.

ఇకపోతే త్వరలో అన్నీ అనుకున్నట్టు జరిగితే రాజమౌళి – సుకుమార్ మధ్య పాన్ ఇండియా ఫైట్ చూసే అవకాశం లేకపోలేదని చెప్పవచ్చు. ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమాతో పాన్ ఇండియా సినిమాను మరొకసారి ఢీకొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే.. ఇంకొక వైపు సుకుమార్ కూడా పుష్ప సీక్వెల్ సినిమాతో సై అంటే సై అంటున్నాడు. మరి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే కచ్చితంగా సుకుమార్ – రాజమౌళి మధ్య ఫైట్ అనేది జరుగుతుంది అని ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version