వామ్మో.. ఆ విషయంలో తండ్రి కంటే ముందు జాగ్రత్త వరుణ్ కే ఎక్కువా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబం నుంచి వచ్చిన నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇక ఆయన తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గురించి కూడా ప్రతి ఒక్కరికి పరిచయమే మెగా ఫ్యామిలీ అండదండలతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వరుణ్ తేజ్ అతి తక్కువ సమయంలోనే హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు. త్వరలోనే ఆయన నటిస్తున్న గాండీవదారి అర్జున సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

మరొకవైపు ఈ సినిమా విడుదల కాకముందే పలాస డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వంలో తన 14వ సినిమా అని కూడా ప్రకటించారు. దానికి మట్కా అనే టైటిల్ ని కన్ఫామ్ చేయగా.. అందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే ఇంకొక వైపు త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్నారు వరుణ్ తేజ్. ఈ క్రమంలోనే ఫ్యామిలీ వస్తుంది ఆ తర్వాత పిల్లలు అంటూ ఖర్చులు ముందు జాగ్రత్తగా ఆలోచించిన వరుణ్ తేజ్ తన తండ్రి కంటే భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది.

వరుణ్ తేజ్ ఒకవైపు హీరో గానే కాకుండా మరొకవైపు వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. పలు బ్రాంచ్ లకి ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్నాడు. తాజా నివేదికల ప్రకారం ఆయన నికర ఆస్తుల విలువ సుమారుగా రూ.50 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నారు. అంతేకాదు గాయత్రి హిల్ లో ఒక గెస్ట్ హౌస్ ని కూడా కొనుగోలు చేసిన ఈయన.. తన పేరు మీద హైదరాబాదులో పలు స్థలాలు, ఫ్లాట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అంతేకాదు కోట్ల విలువ చేసే నాలుగు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయట. ఇవన్నీ చూస్తుంటే తండ్రి కంటే ముందు జాగ్రత్త వరుణ్ తేజ్ కే ఎక్కువగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version