ఆ విషయంలో మీరా జాస్మిన్ ను ఫాలో అవ్వాల్సిందే..

-

టాలీవుడ్ హీరోయిన్ మీరాజాస్మిన్ దాదాపు 20 ఏళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. పది ఏళ్ల పాటు వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడిపారు. తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయారు. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరాజాస్మిన్ ను ఒక విషయంలో ఆదర్శంగా తీసుకోవాల్సిందే అంటూ పొగిడేస్తున్నారు ఆమె అభిమానులు.

హీరోయిన్ మీరాజాస్మిన్ 2004లో వచ్చిన అమ్మాయి బాగుంది చిత్రంతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో శివాజీ సరసన కనిపించి ఆకట్టుకున్నారు. మొదటి సినిమాతోనే మంచి ఛార్మింగ్ హీరోయిన్ అయిపోయారు జాస్మిన్. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకొచ్చుకొని టాలీవుడ్లో హీరోయిన్గా నిలదొక్కుకున్నారు. మలయాళీ భామ అయినప్పటికీ అచ్చం తెలుగు అమ్మాయిలాగా అందరిని అలరించారు. రెండో సినిమా రవితేజ హీరోగా వచ్చిన భద్ర. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఈ విజయం మీరజాస్మిన్ కు కలిసి వచ్చిందని చెప్పాలి ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేశారు. ఆ తర్వాత మాత్రం మీరజాస్మిన్ అనుకున్న స్థాయిలో హిట్ అందుకోలేకపోయారు. కానీ సినిమాల్లో మాత్రం నటించారు. రారాజు ఆకాశ రామన్న, మా ఆయన చంటి పిల్లాడు, గోరింటాకు, యమగోల మళ్ళీ మొదలైంది, మహారధి వంటి చిత్రాలతో అభిమానుల్ని అలరించారు. ఆ తర్వాత సినిమాలకు దూరమై 2014లో దుబాయ్ కి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సెటిలైపోయారు. అయితే కొన్నాళ్లు సక్రమంగా సాగిన వీరి జీవితం తర్వాత మనస్పర్ధలు వచ్చి విడాకుల వరకు వెళ్ళింది.

అయితే మీరజాస్మిన్ తల్లిదండ్రులకు ఈ వివాహం ఇష్టం లేకపోయినా ఆమె పెళ్లి చేస్తుందని విడాకులు తీసుకున్న అనంతరం కూడా తల్లిదండ్రులు ఆమెని చేరనివ్వలేదని సమాచారం. ఈ సమయంలో ఏం చేయాలో తెలియని మీరా మళ్లీ తన సినీ కెరియర్ను మొదలు పెట్టడానికి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఆమె నటించిన అన్ని సినిమాల్లో దాదాపు చీరకట్టులో సంప్రదాయంగా కనిపిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం మాత్రం తన హాట్ అందాలను ఆరబోస్తూ వస్తున్నారు. క్లీవేజ్ షో లతో అభిమానుల్ని అలరిస్తున్నారు. తాజాగా మీరా జాస్మిన్ ఒక టాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ మళ్లీ ఎంతో కాన్ఫిడెంట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన మీరజాస్మిన్ ఆదర్శంగానే తీసుకోవాలని అంటున్నారు ఆమె అభిమానులు. కొందరు స్టార్ హీరోయిన్లు కొన్నాళ్ళు అలరించిన ఆ తర్వత మాత్రం సిల్వర్ స్క్రీన్ కు గుడ్ బాయ్ చెప్పేసి పూర్తి ఫోకస్ తమ వ్యక్తిగత జీవితం పై పెడుతున్నారు. ఇలాంటి వారందరూ కచ్చితంగా మీరాజాస్మిన్ను ఆదర్శంగా తీసుకొని అభిమానుల కోసం సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేయాలని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version