Hanuman : Zee5 OTTలోకి ‘హనుమాన్’.. ఎప్పుడంటే?

-

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘హను-మాన్‌’ మూవీకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం వంద కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.

సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ మూవీ వస్తున్న విషయం తెలిసిందే. 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్ల కలెక్షన్లను సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ వారంలో కొత్త తెలుగు సినిమాల రిలీజ్ లు లేకపోవడంతో త్వరలోనే రూ. 300 కోట్ల మార్క్ కు చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.

జనవరి 12న విడుదలైన ‘హనుమాన్’ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఓటీటీ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. సాధారణంగా సినిమా రిలీజ్ అయిన మూడు వారాల్లో ఓటీటీకి రావాలి. కానీ ఈ చిత్రానికి థియేటర్లలో మంచి స్పందన వస్తుండడంతో 55 రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అంటే మార్చి మొదటి వారంలో స్ట్రీమింగ్ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version