అక్షయ తృతీయ స్పెషల్: ఈరోజు ఎంత మంచి రోజు అంటే…?

-

అక్షయ తృతీయ నాడు యజ్ఞాలు, యాగాలు, జపాలు వంటివి చేస్తే ఎంతో మంచి ఫలితం కనిపిస్తుంది. దానధర్మాలు చేసిన కూడా అక్షయమావుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఏ పుణ్య కార్యాలు చేసినా కూడా అక్షయం అవుతాయి. చాలా మంది ఈ రోజు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అదే విధంగా బంగారం కూడా కొని పూజ చేసి వాటిని ధరిస్తారు.

అయితే కేవలం అక్షయ తృతీయ నాడు ఇంతే కాదు ఈరోజు ఎన్నో గొప్ప విషయాలు జరిగాయి. మరి అక్షయ తృతీయ ప్రాముఖ్యత గురించి ఇప్పుడే చూసేద్దాం..! అక్షయ తృతీయ నాడు ద్రౌపతి శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన రోజు. అలాగే అన్నపూర్ణ దేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు కూడా.

ఆది శంకరులు కనకధారాస్తవం ని చెప్పిన రోజు కూడా ఇదే. అక్షయ తృతీయ నాడు పరశురాముడు కూడా జన్మించడం జరిగింది. భూమిని పవిత్ర గంగానది తాకిన రోజు కూడా ఇదే. అదే విధంగా త్రేతాయుగం మొదలైన రోజు కూడా ఈ రోజే.

శ్రీ కృష్ణుడు తన బాల్య మిత్రుడు అయినా కుచేలుని కలుసుకున్న రోజు కూడా అక్షయ తృతీయ నాడే. వ్యాస మహర్షి మహా భారతమును వినాయకుని సహాయంతో రాయడం మొదలు పెట్టిన రోజు కూడా ఇదే.

సూర్య భగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయపాత్ర ఇచ్చిన రోజు కూడా ఇదే. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహా లక్ష్మి తో సమస్త సంపదలకు సంరక్షణ నియమింపబడిన రోజు కూడా ఇదే.

Read more RELATED
Recommended to you

Exit mobile version