తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కాన్వాయ్ కి ప్రమాదం చోటు చేసుకుంది. పోలీస్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. వరంగల్ పర్యటన లో భాగంగా భట్టి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్నారు. మార్గ మధ్యలో జనగామ లోని పెంబర్తి కళాతోరణం వద్ద డిప్యూటీ సీఎం కాన్వాయ్ లోని పోలీస్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెల్లింది.
ఈ ప్రమాదంలో పోలీస్ వాహనం నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంలో జనగామ ఎస్ఐ చెన్న కేశవులు, కారు డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. క్షత గాత్రులను పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రాణపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనకు బయలు దేరారు.