ఇంట్లో తాబేలుని ఉంచడం చాలా మంచిది. తాబేలు ప్రతిమని ఇంట్లో ఉంచడం వల్ల డబ్బులు నిల్వ ఉంటాయి. అలానే ఇంట్లో ఇబ్బందులేమీ లేకుండా కూడా ఉండొచ్చు. తాబేలుని ఇంట్లో వచ్చేటప్పుడు ఒక ప్లేట్ లో నీళ్ళు పోసి అందులో తాబేలు ప్రతిమని పెట్టాలి. ఇలా ఇంట్లో ఉంచడం వల్ల ఎంతో మంచి కలుగుతుంది. అలానే ఇంట్లో ఉన్న వాళ్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది.
తాబేలు ప్రతిమ ఇంట్లో పెట్టడం వల్ల ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉంటారు. అలానే ఒకటి కంటే ఎక్కువ తాబేలుని ఇంట్లో ఉంచకూడదు. చాలా మంది తాబేలు ఇంట్లో ఉంచితే మంచిది కదా అని నచ్చినన్ని తాబేలు బొమ్మల్ని కొని పెట్టేస్తుంటారు. అలా కాకుండా కేవలం ఒకటి మాత్రమే ఉండాలి, తాబేలు ప్రతిమని పెట్టేటప్పుడు ఉత్తరం వైపు ఉండేటట్టు పెడితే మంచిది.
ఇది మంచిని తీసుకువస్తుంది. అలానే ఒక ఎర్రటి గుడ్డ తీసుకుని అందులో మూడు నాణేలని పెట్టి ఆ గుడ్డ ని కట్టేసి ఉంచితే మంచి కలుగుతుంది. దీనివల్ల ఇంట్లోకి ధనం వస్తుంది. అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. ఇలా ఈ విధంగా ఇంట్లో అనుసరించడం వల్ల సమస్యలు అన్ని తొలగిపోయి ఆనందంగా ఉండడానికి అవుతుంది. కనుక ఈ విధంగా అనుసరించి సమస్యలు లేకుండా ఉండండి.