నేడు బతుకమ్మకు నైవేద్యం పెట్టరు!

-

తొమ్మిదిరోజుల పూల సింగిడి అప్పుడే ఆరోరోజుకు చేరుకుంది. ప్రతిరోజు అమ్మవారిని ఆయా రూపాల్లో ఆరాధిస్తారు. ఈరోజు బతుకమ్మ పండుగలో ఆరో రోజును ’అలిగిన బతుకమ్మ’ అంటారు. ఈ రోజు అమ్మవారు అలకతో ఉంటారని భక్తుల నమ్మకం. అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు.  ఇప్పటికే ఐదురోజుల బతుకమ్మ వేడుకల్లో ఎంగిలిపువ్వు బతుకమ్మ, అటుకల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ వేడుకలు ముగిశాయి.

ఈ రోజు అలకతో ఉంటుంది కాబట్టి భక్తులు ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించరు. దీనిపై ఒక కథ ప్రచారంలో ఉంది. అది ఏంటంటే… పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగలడంతో అపచారం జరిగిందని  కొన్ని చోట్ల 6వ రోజు బతుకమ్మను ఆడరు. మరికొందరు నైవేద్యం సమర్పించకుండా కేవలం బతుకమ్మను ఆడుతారు. ఆయా ప్రాంతాల్లో వేర్వేరు పద్ధతులను పాటిస్తారు.

స్కందమాతగా ఆరాధిస్తే సంతానానికి రక్ష!!

శరన్నవరాత్రులు అక్టోబర్ 3న ఐదోరోజు. ఈరోజు గురువారం. ఆశ్వీజ శుద్ధ పంచమి. ఈ రోజు అమ్మవారిని స్కందమాతగా ఆరాధిస్తారు. పంచమిపై పూజించే దేవత స్కందమాత, స్కంద (లేదా కార్తికేయ ) తల్లి . తన బిడ్డకు ప్రమాదం ఎదురైనప్పుడు తల్లి మారే శక్తికి ప్రతీక స్కందమాత. ఆమ్మ భయంకరమైన సింహ వాహిని అయి నాలుగు చేతులు కలిగి, తన బిడ్డను పట్టుకొని ఉంటుంది నేడు. ఈ రోజు అమ్మవారు గ్రే అంటే బూడిద రంగులో ఉంటుంది. తన పిల్లలకు ఏదైనా హాని వచ్చిందంటే ఆమె ఉరుములుతో కూడినదై ఆ దుష్టశక్తులను సంహరిస్తుంది. ఈ రోజు అమ్మవారిని భక్తి, శ్రద్ధలతో ఆరాధిస్తే వారి సంతానానికి అయు, ఆరోగ్యాలను కలిగిస్తుందని శాస్త్ర ప్రవచనం

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version