మహా శివరాత్రి రోజున శివుడికి ఎన్నో పూజలను, అభిషేకాలను చేస్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద పండుగలా భావించి హిందువులు శివుడిని ఆరాధిస్తారు. అంతేకాకుండా ఉపవాసం మరియు జాగారం వంటివి తప్పకుండా చేస్తారు. అయితే శివరాత్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన రావడం జరిగింది. హిందువులు అందరూ ఈ రోజున శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు, అంతేకాకుండా రాత్రి కూడా దేవాలయాలు అన్నీ తెరిచి ఉంటాయి. దీంతో జాగారం సమయంలో భజనలు, పూజలు వంటివి తప్పకుండా చేస్తారు. ముఖ్యంగా లింగాష్టకం, శివ పంచాక్షరి, బిల్వాష్టకం వంటి మొదలైన నామాలతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
అయితే శివరాత్రి రోజున ఉపవాసం చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. హిందూ పురాణాల ప్రకారం శివరాత్రి రోజున శివుడు గరళం మింగి మనుషులను కాపాడిన రోజు. అందువలనే శివరాత్రిని జరుపుకుంటారు అని పండితులు చెబుతున్నారు మరియు ఉపవాసం ఉండి రాత్రి మొత్తం జాగారం చేసి పూర్తి చేస్తారు. ఇలా చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. అదే విధంగా దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగరాన్ని చిలికినప్పుడు శివుడు అక్కడ వచ్చిన హలాహలాన్ని మింగడం జరిగింది. ఆ సందర్భం లో వచ్చిన ప్రభావానికి ఆందోళన చెందడంతో శివుడికి మెలకువ వచ్చేంతవరకు జాగారాన్ని చేయడం జరిగింది.
అదే విధంగా పరమేశ్వరుడు స్పృహలోకి వచ్చేంతవరకు అక్కడ ఉండే దేవతలు నీళ్లతో అభిషేకం కూడా చేశారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఇదంతా మాఘ బహుళ చతుర్దశి నాడు రాత్రి 12 గంటల వరకు జరిగిన తర్వాత శివుడు స్పృహలోకి వచ్చాడు.ఈ విధంగా జరగడంతో దేవతలు ఎంతో సంతోషంతో కృతజ్ఞతలను చెబుతూ స్వామికి కళ్యాణం కూడా జరిపించడం జరిగింది అని శివపురాణం చెబుతోంది. ఇందువలన భక్తులు కూడా మహాశివరాత్రి రోజున ఉపవాసం మరియు జాగారం వంటివి చేసి అభిషేకాలను, పూజలను తప్పకుండా చేస్తారు. ఈ విధంగా ఆరాధించడం వలన ఎంతో మంచి జరుగుతుంది మరియు ఎంతో మోక్షాన్ని పొందవచ్చు.