పిల్లలు: పుట్టిన వారికి మరణం తప్పదు అని మనకు తెలుసు.. కానీ ఆ మరణం.. ఎప్పుడో రావాల్సిందే.. పసిబిడ్డలుగా ఉన్నప్పుడే వస్తే..మనం అందరం అనే మాట.. ఏం పాపం చేసాడని ఆ చిన్నపిల్లాడ్ని దేవుడు అప్పుడే తీసుకెళ్లిపోయాడు అంటారు. కాసేపు సైన్స్, టెక్నాలజీ పక్కనపెట్టి..ఆధ్యాత్మికంగా ఆలోచిద్దాం.. చిన్నపిల్లలు చనిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి.. అవేంటంటే..
పిల్లలు ఏం పాపం చేయకున్నా వారిని దేవుడు త్వరగా తీసుకెళ్లాడు అంటే.. అది వారి పాపం కాదు, వారి తల్లిదండ్రులు చేసిన పాపాలే అని చెప్పవచ్చు. ముఖ్యంగా పూర్వ జన్మలో చేసిన పాప పుణ్యాల ఫలితంగా మనకు ఈ జన్మలో అనుభవాలు కలుగుతాయని పండితులు అంటున్నారు..
జ్యోతిష్యం ప్రకారం.. పన్నెండు సంవత్సరాల వరకు పిల్లలకు బాలారిష్టాలు ఉంటాయి. అప్పటి దాకా ఆయుర్దాయం లెక్క కట్టకూడదట..ఏమైనా సమస్యలు వస్తే జప, హోమ, వైద్య చికిత్సల ద్వారా తగ్గించుకోవాలి.
ఏ వయసులో చనిపోతే ఏ దోషం
ఇక పిల్లలు 4 సంవత్సరాల లోపల చనిపోతే అది మాతృదోషం. అంటే తల్లి చేసిన పాపాల వల్ల బిడ్డ చనిపోయినట్లు అర్థం చేసుకోవాలి. అదే 4 నుంచి 8 ఏళ్ల మధ్య పిల్లలు చనిపోతే అది పిత్రుదోషం. అంటే తండ్రి చేసిన పాపాల వలన బిడ్డ చనిపోయినట్లు లెక్క. ఇక 8 నుంచి 12 సంవత్సరాల లోపల చనిపోతే అది బాలుర దోషం. అంటే ఆ పిల్లలు పోయిన జన్మలో చేసిన పాపాల ఫలితంగా మరణిస్తున్నారని అర్థం.
అంతే కాకుండా కొన్ని కుటుంబాలకు/వ్యక్తులకు ప్రబలమైన నాగదోషాలు ఉంటాయి. వారిలో ఎవరి వలన ఎవరు చనిపోతారు అనేది చెప్పడం చాలా కష్టం.. కారణం ఏదైనా తల్లితండ్రుల కంటే ముందే పిల్లలు చనిపోవడం, అందులోనూ పసిపిల్లలు చనిపోవడం అనేది చెప్పలేని తీర్చలేని బాధ. పగవారికి కూడా అలాంటి కష్టాలు రాకూడదు. అలా రాకూడదంటే.. మీరు మీ జీవితాన్ని ఒకరిని మోసం చేయకుండా బతకితే చాలు.. మన ప్రమేయం లేకుండా చాలా జరుగుతాయి.. కానీ మనం తెలిసి మాత్రం ఎప్పటకీ తప్పు చేయకూడదు.. కాలం ఎంత మారినా..కర్మకు అందరూ బాధ్యులే..!