వైసీపీ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉందా..? – సోము వీర్రాజు

-

కర్నూలులో హై టెన్షన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అవినాష్ రెడ్డి తల్లి చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు సిబిఐ అధికారులు. అవినాష్ ను అదుపులోకి తీసుకుంటే ఎదురయ్యే పరిణామాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు పరిణామాలపై సిబిఐనే అడగాలని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. సిబిఐ స్వయంప్రతిపత్తి గల సంస్థ అని అన్నారు. ఇక పొత్తులప్తె కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు.

ఏపీ రాజధాని అమరావతి లోనె ఉండాలన్నదీ బిజెపి పార్టీ లక్ష్యం అన్నారు. వైసీపీ, టిడిపి ఇరు పార్టీలు అమరావతి కట్టడంలో ఫెయిలయ్యారని ఆరోపించారు సోము వీర్రాజు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికోసం రాజకీయాలు చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వానికి దమ్ము ధైర్యం ఉందా..! అని సవాల్ విసిరారు. కేంద్ర నిధులు కాకుండా రాష్ట్ర నిధులు ఒక పైసైన ఖర్చు చేశారా…! అని ప్రశ్నించారు. బీసీలను నట్టేట ముంచిన ప్రభుత్వమేదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమేనని అన్నారు. పేరుకు బీసీ కార్పొరేషన్ పెట్టారు గాని నిధులన్నీ నిల్ అని ఎద్దేవా చేశారు సోము వీర్రాజు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ చైతన్య సభలు నిర్వహించబోతున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version